కాంగ్రెస్ టికెట్ దక్కలేదని బోరున ఏడ్చిన పటేల్ రమేశ్ రెడ్డి - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
🎬 Watch Now: Feature Video
Published : Nov 10, 2023, 2:36 PM IST
Patel Ramesh Reddy Crying about Congress MLA Seat : సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని పటేల్ రమేశ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యలు, కార్యకర్తలు కన్నీరుమున్నీరుగా(Ramesh Reddy Family Members and his Followers Crying) విలపించారు. గురువారం వరకు తమకే టికెట్ ఇస్తామని చివరి క్షణంలో దామోదర్ రెడ్డికి టికెట్ ఇచ్చారని వాపోయారు. రెండు పర్యాయాల నుంచి ఇదే జరుగుతోందని.. ఈసారి కూడా మొండి చేయి చూపించారని వాపోయారు. ఎవరెన్ని కుట్రలు చేసినా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలుస్తామని కుటుంబ సభ్యులు, కార్యకర్తలు చెబుతున్నారు.
Suryapet Congress MLA Ticket Issue : సూర్యాపేటలో పటేల్ రమేశ్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో.. ఆయన అనుచరులు అర్ధరాత్రి విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. పార్టీ కోసం కష్టపడితే.. మాట ఇచ్చి తప్పారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కూడా ఈ విధంగానే జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సారి స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.