NTR 100th Birthday Special: దిల్లీ పెత్తనాన్ని ఎదిరించిన ధీరుడు.. ఆయన అడుగే మహా ప్రభంజనం - తెలుగు రాజకీయ యవనికపై NTR సంతకం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 28, 2023, 10:53 AM IST

NTR Mark in Politics: నిలువెత్తు తెలుగుదనం.. ప్రజాసేవకు ప్రతిరూపం.. నిజాయతీకి నిలువుటద్దం. తెలుగు రాజకీయాల్లో ఆయన అడుగే మహా ప్రభంజనం. ప్రజల ఆశీర్వాదంతో అఖండ విజయం సాధించిన అనితర సాధ్యుడు.. సంక్షేమ పథకాలకు ఆద్యుడు.. పేదల ఆకలి తీర్చిన దేవుడు. సమాఖ్య వ్యవస్థ పరిరక్షణకు పరితపించిన నాయకుడు.. ప్రాంతీయ శక్తులను ఐక్యం చేసి, దిల్లీ పెత్తనాన్ని ఎదిరించిన ధీరుడు. ఆయనే.. తెలుగు జనహృదయ సామ్రాట్.. ఆంధ్రుల అన్నగారు.. మనందరి ఎన్టీవోడు.. నందమూరి తారకరాముడు.

తెలుగు రాజకీయాల్లో ఆ పేరే పెను సంచలనం. ఆయన అడుగే మహా ప్రభంజనం. సినీ వినీలాకాశంలో తిరుగులేని కథానాయకుడిగా వెలుగొంది.. రాజకీయాల్లోనూ ఎదురులేని నాయకుడిగా కొత్త చరిత లిఖించిన మహాయోధుడు. సమున్నత సంకల్పంతో రాజకీయాల్లో అడుగుపెట్టి.. తెలుగోడి ఆత్మగౌరవ నినాదంతో దిల్లీ పీఠాన్ని ఢీకొట్టి.. పార్టీ పురుడు పోసుకున్న 9 నెలల్లోనే ప్రకంపనలు సృష్టించిన రాజకీయ దురంధరుడు. తెలుగు రాజకీయ యవనికపై NTR సంతకం దృఢమైనది. ఆయన ముద్ర ప్రబలమైనది. నాటికీ, నేటికీ, మరెన్నటికీ చెరిగిపోనిది. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.