MP Arvind Y Category Security : ఎంపీ అర్వింద్‌కు Y- కేటగిరీ భద్రత.. ఆయన రియాక్షన్ ఇదే..! - MP Arvind Reaction on Y category security
🎬 Watch Now: Feature Video
MP Arvind Reaction on Y category security : కేంద్ర హోంశాఖ వై కేటగిరీ భద్రత కేటాయింపుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. తాను సెక్యూరిటీ కావాలని కేంద్రాన్ని కోరలేదనీ స్పష్టం చేశారు. గతంలో తనపై జరిగిన దాడులను విశ్లేషించి అధికారులే ఇంటికి వచ్చారనీ చెప్పారు. గతంలో జరిగిన దాడులు, పరిణామాలను అధికారులకు వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. తనకు ఎలాంటి సెక్యురిటీ ఇస్తారో ఇంకా తెలియదని చెప్పుకొచ్చారు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు పెరిగాయి. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే ఎంపీ అర్వింద్‌కు కేంద్ర హోంశాఖ వై కేటగిరి భద్రత కల్పించింది. ఇందులో భాగంగా 8మంది సెక్యూరిటీ సిబ్బంది ఇకపై అర్వింద్ వెంట ఉంటారు. ఆయన చుట్టూ ముగ్గురు, ఇంటి దగ్గర మరో ఐదుగురు విధులు నిర్వర్తిస్తారు. మరో గార్డ్‌ను కూడా అదనంగా ఉంటారు. మరోవైపు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. వీరి ఇరువురికి భద్రత పెంచిన కేంద్ర హోంశాఖ.. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రం ఇంకా ఇవ్వలేదు.