పిచ్చుకకి సీపీఆర్ చేసి.. ప్రాణం పోసి..!
🎬 Watch Now: Feature Video
మనుషులకు సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడుతుంటాం. కానీ జంతువులకు అలాంటి టెక్నాలజీ వచ్చిందా.. వాటికి కూడా అలా చేసి ప్రాణాలను కాపాడొచ్చా అంటే అవుననే చెప్పొచ్చు. అదేంటి జంతువులు, పక్షులకు సీపీఆర్ ఎందుకు చేస్తాం.. ఎలా చేస్తాం అనే సందేహం వస్తుంది కదా. చెప్పడం కాదు మీరు కూడా చూడండి. ఫ్యాన్ తాకి పడిపోయిన పిచ్చుకకు సీపీఆర్ చేసి దాని ప్రాణాలను ఎలా కాపాడారో ఓ వ్యక్తి.
నిర్మల్ జిల్లా భైంసా మండలం హజ్గుల్ గ్రామానికి చెందిన శ్యామ్ అనే వ్యక్తి ఇంటి వద్ద స్వేచ్ఛగా సంచరిస్తున్న పిచ్చుక ధాన్యపు గింజల కోసం ఇంట్లోకి రాగా.. ఫ్యాన్ తగిలి అక్కడికక్కడే కిందపడిపోయింది. వెంటనే గమనించిన శ్యామ్.. ఆ పిచ్చుకకి ఊపిరాడటం లేదని గుర్తించాడు. ఇటీవల చాలా మంది మనుషులు గుండె ఆగిపోయి చనిపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గుండె పని చేయడం ఆగిన మనుషులకు సీపీఆర్ ఇలా చేయాలంటూ డాక్టర్స్, పలు స్వచ్ఛంద సంస్థలు సామాజిక మాధ్యమాల వేదికగా అవగాహన కల్పిస్తున్నాయి. ఆ విషయం గుర్తుకు వచ్చిన శ్యామ్.. అదే అస్త్రాన్ని పిచ్చుకపై ప్రయోగించాడు. వెంటనే ఆ పిచ్చుక ఊపిరి తీసుకోవడం ప్రారంభించింది. మెలకువలోకి వచ్చిన పిచ్చుకకు.. కొంత సమయానికి నీటిని ఇచ్చారు. కోలుకున్న పిచ్చుక నీటిని తాగి సంతోషంగా పైకి ఎగిరిపోయింది.