Nara Lokesh Reveals Love Story with Brahmani: బ్రాహ్మణితో నాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌: లోకేశ్ - Nara Lokesh Reveals Love Story with Brahmani

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 16, 2023, 9:06 PM IST

Nara Lokesh Reveals Love Story with Brahmani: బ్రాహ్మణితో తనది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. మంగళగిరిలో విద్యార్థులు, యువతతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ యువతి బ్రాహ్మణితో మెదటిగా పెళ్లి ప్రతిపాద ఎవరు తీసుకొచ్చారు.. ఆ ప్రస్తావన రాగానే మీరు ఎలా స్పందించారని అడగగా దానికి లోకేశ్​ మాట్లాడుతూ.. బ్రాహ్మణితో తనది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అన్నారు. ఇంట్లో అంతా ఓ వెకేషన్​కి వెళ్లినప్పుడు పెళ్లి విషయంలో నా అభిప్రాయం అడిగారు.. నేను ఒప్పుకున్నాను బ్రాహ్మణి కూడా ఒప్పుకుంది.. ఇంకా అలా మా పెళ్లి అయిందని ఆ యువతి అడిగిన ప్రశ్నకు సరదాగా నవ్వుతూ జవాబు ఇచ్చారు. ఆ తర్వాత వేరే యువతి లోకేశ్​ మొదటి క్రష్​ అని అడగగా.. సభా ప్రాంగణం అంతా యువత అరుపులతో మార్మొగిపోయింది. ఆ ప్రశ్నకు స్పందించిన లోకేశ్​.. నాకు చాలా మంది క్రష్​లు ఉన్నారని అన్నారు. కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్​లో ఉన్నప్పుడు చేయ్యాల్సిన పనులు అన్నీ చేశానని.. కాలేజీ లైఫ్​ అంటే ఎంజాయ్​ చేయ్యాలని అన్నారు. ఈ మేరకు యువత అడిగిన ప్రశ్నలకు లోకేశ్​ సమాధానం చెప్పి వారిలో ఉత్సాహాన్ని నింపారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.