Nandamuri Ramakrishna Participated in Deeksha: చంద్రబాబు వెంటే.. నందమూరి కుటుంబం: రామకృష్ణ - తెలుగుదేశం అధినేత చంద్రబాబు వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-09-2023/640-480-19511480-thumbnail-16x9-nandamuri-ramakrishna.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Sep 14, 2023, 4:52 PM IST
Nandamuri Ramakrishna Participated in Deeksha: సీఎం జగన్ స్క్రిప్ట్ (jagan script) ప్రకారమే తెలుగుదేశం అధినేత చంద్రబాబును రాక్షసంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారని నందమూరి రామకృష్ణ మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డు వద్ద తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు నిర్వహించిన రిలే నిరాహారదీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... ఎలాంటి ఆధారాలు లేకున్నా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ (arrest) చేసి రిమాండ్ కు తరలించారని ధ్వజమెత్తారు. దేశంలోని ప్రముఖలంతా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నారని రామకృష్ణ (Ramakrishna) తెలిపారు. వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలంతా కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అక్రమ కేసుల నుంచి బయటపడి... ఎన్నికల్లో గెలిచి మళ్లీ చంద్రబాబు (Chandrababu) సీఎంగా రాష్ట్రాన్ని దేశంలో ముందువరసలో ఉంచుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నందమూరి కుటుంబం చంద్రబాబు వెంటే ఉంటుందని రామకృష్ణ పేర్కొన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.