Mynampally Fires on Minister Mallareddy : మల్లారెడ్డి.. రూ.100 కోట్లు ఖర్చు చేసి మంత్రి అయ్యారు: ఎమ్మెల్యే మైనంపల్లి - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Oct 11, 2023, 10:33 AM IST
Mynampally Fires on Minister Mallareddy : రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా.. ఆరు గ్యారంటీలతో ప్రజల్లోకి వెళ్లబోతున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మల్కాజిగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మల్లారెడ్డి.. మంత్రి పదవిలో ఉండి గల్లీ లీడర్లా వ్యవహరిస్తున్నారన్నారు. మల్లారెడ్డి మంత్రి కాదు కబ్జాకోరని.. రూ.100 కోట్ల ఖర్చు చేసి మంత్రి అయ్యారని ఆరోపించారు. రూ.1000 కోట్లకు పడగలెత్తాడని.. ఆయన కాలేజీలు మొత్తం చెరువులో ఉన్నాయన్నారు. తనను మల్కాజిగిరిలో ఓడించేందుకు బీఆర్స్ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరుతానని ఆశాభావం వ్యక్తం చేశారు.
Mynampally Fires on BRS : బీఆర్ఎస్ నేతలు డబ్బు కట్టలతో ఓట్లను కొనాలని చూస్తున్నారని మైనంపల్లి మండిపడ్డారు. భయంతో తన భద్రతా సిబ్బందితో పాటు పోలీస్ అధికారులనూ బదిలీ చేయించారని, ఎవరికి అభద్రతా భావం ఉందో చెప్పాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మే స్థితిలో లేరని.. వారు ప్రవేశపెట్టే పథకాలన్నింటిలోనూ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలు కేవలం 30 శాతం కమీషన్ల కోసమే ప్రవేశపెట్టారని తెలిపారు. గులాబీ పార్టీ పతనమే ధ్యేయంగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించబోతున్నామని స్పష్టం చేశారు.