చిన్నపాటి వర్షానికే గ్రేటర్ హైదరాబాద్ ఆగమవుతోంది : అంజన్ కుమార్ యాదవ్ - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
🎬 Watch Now: Feature Video


Published : Nov 23, 2023, 5:39 PM IST
Musheerabad Congress Candidate Anjan Kumar Yadav Interview : చిన్నపాటి వర్షానికే గ్రేటర్ హైదరాబాద్ ఆగమవుతోందని ముషీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. తన నియోజకవర్గంలో అధికంగా డ్రైనేజీ, తాగునీటి సమస్య ఉందని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికే వెళ్లాయని విమర్శించారు. తన నియోజకవర్గంలో కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా మాట తప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్ల కంటే ఎక్కువ సాధించి.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అంజన్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉద్యోగాలు లేక యువత భవిష్యత్తు ఆగమవుతోందని మండిపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేర్చిందని చెబుతున్న ముషీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.