గణపయ్య సేవలో ముఖేశ్ అంబానీ.. మనవడిని ఎత్తుకొని గుడికి.. - మనవడితో గుడికి వచ్చిన అంబానీ
🎬 Watch Now: Feature Video
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ శ్రీ సిద్ధివినాయకుడి సేవలో తరించారు. మహారాష్ట్ర ముంబయిలోని ఈ ప్రముఖ ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఆలయ పూజారులు ఆయన మెడలో శాలువా కప్పి సత్కరించారు. అనంతరం కుమారుడు ఆకాశ్ అంబానీ, కొడలు శ్లోకా మెహతాతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబానీ.. తన మనవడు పృథ్వీ అంబానీని ఎత్తుకొని గుడిలోకి రావడం విశేషం. పూజ కోసం ప్రత్యేకమైన పళ్లాల్లో పండ్లు, స్వీట్లను తీసుకొచ్చారు. బొజ్జ గణపయ్య కోసం భారీ సైజు లడ్డూను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు.
ప్రముఖ వ్యాపారవేత్త కావడం వల్ల భారీ భద్రత నడుమ వినాయకుడిని దర్శించుకున్నారు అంబానీ. ఆయన రాకతో కాసేపు సాధారణ భక్తుల దర్శనాలను నిలిపివేశారు ఆలయ అధికారులు. కొద్ది నెలల క్రితమే ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ తన భార్య రాధికా మర్చంట్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు.