MP Dharmapuri Comments on KTR : '24 గంటల విద్యుత్‌పై కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదు' - కోరుట్లలో టిఫిన్ బాక్స్ కార్యక్రమం
🎬 Watch Now: Feature Video
MP Dharmapuri Arvind Participated Tiffin Box Program : మంత్రి కేటీఆర్ మత్తుకు బానిసై.. ఏం మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటుగా వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గండి హనుమాన్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో కోరుట్ల నాయకులు ఏర్పాటు చేసిన టిఫిన్ బాక్స్ కార్యక్రమంలో ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ కార్యాచరణ గురించి చర్చించారు. అనంతరం అందరూ కలిసి వెంట తెచ్చుకున్న టిఫిన్ బాక్స్‌లను ఆరగించారు. ఈ సందర్భంగా డబ్బుల కోసం పార్టీ మారే నాయకులు బీజేపీలో లేరని ఎంపీ ధర్మపురి అర్వింద్పేర్కొన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ దేశం అంతా ఉందని.. మత్తులో ఉన్న మంత్రి కేటీఆర్‌కు అది కనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు. ఒక్క తెలంగాణలోనే 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు కేటీఆర్ చెప్పుకోవడం సిగ్గు చేటని ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు.