బురదలో కూరుకుపోయిన ప్రధాని హెలికాప్టర్.. జేసీబీ సాయంతో..
🎬 Watch Now: Feature Video
ప్రధాని నరేంద్ర మోదీ సెక్యూరిటీ హెలికాప్టర్ మట్టిలో కూరుకుపోయింది. ఆర్మీకి చెందిన ఈ చాపర్ బురదలో ఇరుక్కుపోయింది. కర్ణాటకలోని రాయ్‌చూర్‌లో ఈ ఘటన జరిగింది. రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హెలికాప్టర్ దిగాల్సిన హెలిప్యాడ్ బురదగా మారింది. దీంతో హెలిక్యాప్టర్ ఓ పక్క మట్టిలో కూరుకుపోయింది. హెలిప్యాడ్‌ను హడావుడిగా ఏర్పాటు చేయడం కూడా.. దీనికి ఒక కారణంగా తెలుస్తోంది. చాపర్‌ను బయటకు తీసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అందుకోసం ఓ జేసీబీని సైతం వినియోగించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. మంగళవారం రాయచూర్ జిల్లా సింధనూర్ తాలుకాలోని హోసహళ్లి ప్రాంతంలో ప్రధాని మోదీ ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థుల తరపున మోదీ ప్రచారం చేసేందుకు.. హెలికాప్టర్లో వెళ్లారు. అందుకు సంబంధించిన ప్రణాళికను పార్టీ రూపొందించింది. దీంట్లో భాగంగానే రాయచూర్, కొప్పాల జిల్లాలో ప్రధాని పర్యటన చేశారు. ప్రధాని సెక్యూరిటీ కోసం వచ్చిన హెలికాప్టర్.. ఇలా అనుకోకుండా మట్టిలో కూరుకుపోయింది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. 13న లెక్కింపు జరుగుతుంది.