అమెరికాలో స్పెషల్ 'మోదీ థాలీ'.. త్రివర్ణంలో ఇడ్లీలు, మిల్లెట్స్‌తో వంటకాలు - మోదీ థాలీ అమెరికా
🎬 Watch Now: Feature Video
అమెరికా పర్యటనకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు అక్కడి భారతీయులు వినూత్న ఏర్పాట్లు చేస్తున్నారు. న్యూజెర్సీలోని ఓ భారతీయ రెస్టారెంట్ మోదీ పర్యటనకు గుర్తుగా ప్రత్యేక థాలీని సిద్ధం చేసింది. 'మోదీజీ థాలీ' పేరుతో ప్రత్యేక వంటకాలను రెడీ చేసింది. మోదీ థాలీని రెస్టారెంట్ చెఫ్, యజమాని శ్రీపాద్ కులకర్ణి సిద్ధం చేశారు. కిచిడీ, రసగుల్లా, సర్సో దా సాగ్, దమ్ ఆలూ, కశ్మీరీ ఆలూ, ధోక్లా, చాచ్, పాపడ్లతో థాలీని ప్రత్యేకంగా రెడీ చేశారు. 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ఐరాస ప్రకటించిన నేపథ్యంలో.. థాలీలోనూ వాటికే ప్రాధాన్యం ఇచ్చారు. జాతీయ జెండాలో ఉండే మూడు రంగుల్లో ఇడ్లీలను తయారు చేశారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు అంకితమిస్తూ ఆయన పేరు మీద మరో థాలీని సిద్ధం చేస్తామని చెబుతున్నారు.
"త్వరలోనే మోదీ థాలీని రెస్టారెంట్లో అందుబాటులోకి తెస్తాం. ఈ థాలీకి మంచి పాపులారిటీ వస్తుందని అనుకుంటున్నా. దీన్ని అందరూ ఇష్టపడితే త్వరలో డాక్టర్ జైశంకర్ థాలీని తయారు చేస్తాం. అమెరికాలోని భారతీయులకు ఆయనో రాక్‌స్టార్. అందుకే ఆయన పేరు మీద థాలీ సిద్ధం చేస్తాం."
-శ్రీపాద్ కులకర్ణి, రెస్టారెంట్ యజమాని, చెఫ్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటించనున్నారు. జూన్ 21న మధ్యాహ్నం న్యూయార్క్‌లో ల్యాండ్ అవ్వనున్నారు. 22న మోదీకి బైడెన్ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానికి స్వాగతం పలికేందుకు భారతీయ అమెరికన్లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 18న అమెరికాలోని 20 ప్రధాన నగరాల్లో భారత ఐక్య దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. జూన్ 21న శ్వేతసౌధం సమీపంలో ఉన్న విల్లార్డ్ ఇంటర్‌కాంటినెంటల్‌లో ఫ్రీడం ప్లాజా పేరుతో 600 మంది భారత సంతతి ప్రజలు సమావేశం కానున్నారు. వీరి ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.