ఈజిప్ట్ పిరమిడ్స్‌ను సందర్శించిన మోదీ.. నిర్మాణంపై ఆరా.. భారత్‌కు రిటర్న్ - ఈజిప్ట్ పిరమిడ్‌లను సందర్శించిన ప్రధాని మోదీ
🎬 Watch Now: Feature Video
ఈజిప్ట్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ గిజాను సందర్శించారు. ఈజిప్ట్ ప్రధాని ముస్తఫాతో కలిసి ఈ గ్రేట్ పిరమిడ్‌లను సందర్శించారు మోదీ. పిరమిడ్ల గురించి ముస్తఫాను అడిగి తెలుసుకున్నారు మోదీ. రెండు రోజులుగా ఈజిప్ట్‌లో పర్యటిస్తున్న మోదీ.. ఆదివారం ఈ పిరమిడ్‌లను సందర్శించారు. ఈ పిరమిడ్‌లను ఈజిప్ట్ రాజవంశానికి చెందినవిగా చెబుతారు. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన ఈ గ్రేట్ పిరమిడ్లు.. ఈజిప్టు రాజధాని కైరో శివార్లలో ఉన్నాయి. క్రీస్తు పూర్వం 26వ శతాబ్దంలో 27 ఏళ్ల పాటు.. నైలు నది పశ్చిమ ఒడ్డునున్న రాతి పీఠభూమిపై వీటిని నిర్మాణం జరిగింది.
మరోవైపు ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద నైలు అవార్డును.. ప్రధాని మోదీకి అందజేశారు ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి. అంతకుముందు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈజిప్టు, పాలస్తీనాల్లో ఉండి.. పోరాడి మరణించిన భారతీయ సైనికులకు ఆయన నివాళులు ఆర్పించారు. కైరోలోని అతి పురాతన అల్ హకీమ్ మసీదును కూడా మోదీ సందర్శించారు. అనంతరం ఈజిప్ట్‌లో తన రెండు రోజుల పర్యటనను ముగించిన ప్రధాని.. భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.