MLC Palla Comments on Ponnala BRS Joining : పొన్నాల వస్తానంటే.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తాం : ఎమ్మెల్సీ పల్లా - కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా
🎬 Watch Now: Feature Video
Published : Oct 13, 2023, 7:11 PM IST
MLC Palla Comments on Ponnala BRS Joining : టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) రాజీనామాపై జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్లోకి వస్తానంటే కచ్చితంగా ఆహ్వానిస్తామని వెల్లడించారు. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ(Telangana Congress)కి రాజీనామా చెయ్యడం శుభపరిణామమని పల్లా పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన నాయకుడికే మొండి చెయ్యి చూపెట్టి.. పైసలకు టిక్కెట్లు అమ్ముకునే నాయకత్వం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు.
MLA Palla Reacts On Ponnala Congress Resign : జనగామ అభివృద్ధిలో భాగస్వామి అయిన పొన్నాలను బీఆర్ఎస్లోకి రావాలని సాదరంగా ఆహ్వానిస్తున్నామని.. కలిసి జనగామ అభివృద్ధికి కృషి చేద్దామని పల్లా పిలుపునిచ్చారు. మరోవైపు ఈ నెల 16న జనగామలో నిర్వహించనున్న భారీ బహిరంగా సభకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) హాజరు కానున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈసారి 100 స్థానాల్లో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూడా తమని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని పల్లా తెలిపారు.