బ్యాలెట్ పత్రంపై ఫొటో చిన్నగా ముద్రించటంపై - ములుగు ఎమ్మెల్యే సీతక్క ధర్నా - కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాలు
🎬 Watch Now: Feature Video
Published : Nov 21, 2023, 10:58 AM IST
MLA Seethakka Protest at Returning Office in Mulugu : ములుగు జిల్లాలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట కాంగ్రెస్ అభ్యర్థి దనసరి అనసూయ (సీతక్క) ఆందోళనకు దిగారు. ఈవీఎం బ్యాలెట్ పత్రంలో తన ఫొటో చిన్నగా ఉందని ఆరోపిస్తూ సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు బైఠాయించారు. ములుగు ఎస్సై అక్కడికి చేరుకొని సముదాయించినా.. స్పష్టమైన హామీ ఇవ్వాలని సీతక్క పట్టుబట్టారు.
అంతకుముందు ఈ విషయంలో అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కాంగ్రెస్ నాయకులు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఎన్నికల అధికారులు బీఆర్ఎస్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని, పారదర్శకత పాటించాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. రిటర్నింగ్ అధికారి అంకిత్ సూచన మేరకు మరో ఫొటోను బ్యాలెట్‌పై పొందుపరుస్తామని రిటర్నింగ్ అధికారి చెప్పారు. కానీ ఆయన హామీలో స్పష్టత లేదంటూ కాంగ్రెస్ నాయకులు నిరసన కొనసాగించారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సీతక్కకు ఫోన్ చేసి ఆరా తీశారు.