MLA Muthireddy Yadagiri Reddy Fires on Palla : 'పల్లా రాజేశ్వర్‌రెడ్డి కార్పొరేట్ పద్ధతిలో కుట్రలు చేస్తూ.. నా బిడ్డను, అల్లుడిని చెడగొట్టారు' - BRS Latest News
🎬 Watch Now: Feature Video
Political War in Jangaon Constituency : తనపై రాజకీయంగా కుట్రలు జరుగుతున్నాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో కార్పొరేట్ పద్ధతిలో కుట్రలు చేస్తూ.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన బిడ్డను, అల్లుడిని చెడగొట్టారని ఆరోపించారు. ఏనాడూ జనగామ ప్రజలను ఆదుకోలేని వ్యక్తి.. ఈనాడు పార్టీకి ఇబ్బందిగా మారారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ అధిష్ఠానం జనగామ అసెంబ్లీ టికెట్ తనకే కేటాయించిందని ప్రచారం చేస్తూ.. కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో రాజకీయంగా ఓడించలేక.. తన ఇంట్లో చిచ్చు పెట్టారని ధ్వజమెత్తారు. మంత్రి హరీశ్‌రావు ఫోన్ చేశారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన అనుచరులను తీసుకెళ్లారని.. అసలు హరీశ్‌రావు ఎవరికీ ఫోన్ చేయలేదని ముత్తిరెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మొదటి విడతలో జనగామ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాలన్నారు. ఉద్యమం అంటే తెలియని పల్లా.. ప్రలోభాలు మానాలని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హితవు పలికారు. ఇదిలా ఉండగా.. జనగామ అసెంబ్లీ టికెట్ పల్లాకే ఖరారైందన్న ప్రచారంతో.. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయాయి. ముత్తిరెడ్డి వర్గీయులు "పల్లా గో బ్యాక్" అంటూ ఆందోళనలు చేపట్టారు.