ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో సీఎంకే స్పష్టత లేదు : కడియం శ్రీహరి - MLA Kadiyam on Elections
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-01-2024/640-480-20477833-thumbnail-16x9-srihari.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jan 10, 2024, 10:08 PM IST
MLA Kadiyam Srihari on Formula E Racing : ఫార్ములా ఈ రేస్‌కు కేటాయించిన నిధులు దుర్వినియోగమైతే విచారణ చేసుకోవచ్చని, కానీ దాన్ని రద్దు చేయడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో జరిగిన వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు కార్యకర్తలు విలువైన సూచనలు ఇచ్చారని, కుంగి పోవాల్సిన అవసరం లేదు మళ్లీ పుంజుకుని ముందుకు సాగుదామని కార్యకర్తలకు తాను భరోసా ఇచ్చానని కడియం తెలిపారు.
Kadiyam on Congress : సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలన్న సూచనలే ఎక్కువగా వచ్చాయని, జిల్లా పార్టీ కార్యాలయాలు పటిష్ఠంగా పని చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కడియం శ్రీహరి వివరించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను అక్కడ గ్యారంటీల అమలుకు సాధ్యం కాదని, వాటి వల్ల కోతలు తప్పవని ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి హెచ్చరించారని ఎమ్మెల్యే కడియం తెలిపారు. కర్ణాటక తరహా పరిస్థితే తెలంగాణలో ఉంటుందని తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. గ్యారంటీలు ఏ రకంగా అమలు చేయబోతున్నారో సీఎం, డిప్యూటీ సీఎం స్పష్టంగా చెప్పలేక పోతున్నారని వ్యాఖ్యానించారు.