Etela Rajender Security : ఈటలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం - Medical DCP Sandeep Rao latest news
🎬 Watch Now: Feature Video
MLA Etela Rajender Security : హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ప్రాణహాని ఉందన్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ కూడా స్పందించింది. ఈటల రాజేందర్‌కు భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటలోని ఈటల నివాసానికి మేడ్చల్ డీసీపీ సందీప్ రావు వెళ్లారు. ఆ సమయంలో ఈటల రాజేందర్ వరంగల్ పర్యటనలో ఉన్నారు. విషయం తెలుసుకున్న డీసీపీ ఫోన్‌లో ఆయనను భద్రత విషయంలో సంప్రదించగా .. రేపు సాయంత్రానికి శామీర్‌పేట నివాసానికి రానున్నట్లు చెప్పారు. పార్టీ విస్తారక్‌లకు కాజీపేటలో స్వాగతం పలికేందుకు ఈటల రాజేందర్ వెళ్లారు.
మరోవైపు ఇప్పటికే ఈటలకు ప్రాణహాని ఉందన్న విషయంపై కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్‌కు కేంద్ర హోంశాఖ వై కేటగిరీ భద్రత కల్పించనున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం, ఆయనకు ప్రాణహాని ఉన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో.. కేంద్ర హోంశాఖ భద్రత కల్పించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.