రైతులకు ఎట్టిపరిస్థితుల్లో ఎరువుల కొరత రాకూడదు : మంత్రి తుమ్మల - tummala Review meet on Hyderabad

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 18, 2024, 7:50 PM IST

Minister Tummala Review Meeting on Fertilizers : రైతులకు ఎట్టి పరిస్థితుల్లోను ఎరువుల కొరత రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఎరువులను ముందుగానే గ్రామస్థాయి వరకు చేర్చేందుకు కంపెనీలతో కలిసి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. యాసంగికి సీజన్​కి ఎనిమిదిన్నర లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు, నాలుగున్నర లక్షల టన్నుల యూరియా నిల్వలున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. 

Minister Tummala Review Meeting on Farmers Bank Loan : డీసీసీబీ, పీఏసీఎస్​లలో రుణ బకాయిలను వసూలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వ్యవసాయేతర రుణాలు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం సహా రుణ వసూళ్లు చేయని అధికారులపైనా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనల మేరకు కొత్త రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. పీఏసీఎస్​లో నిబంధనలకు విరుద్ధంగా రుణాలు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆ సంఘాలను బలోపేతం చేయాలని, ఎరువులు, సహకార రుణాలపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.