సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం : మంత్రి శ్రీధర్ బాబు - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Dec 25, 2023, 5:10 PM IST
Minister Sridhar Babu Singareni Election Campaign: సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్మికులకు ఈ మేరకు హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆర్జీ 3 పరిధిలోని ఏఎల్పీ, ఓసీపీ 1, ఓసీపీ 2 బొగ్గు గనుల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ తరఫున మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ సంఘాన్ని గెలిపించాలని కోరిన మంత్రి, సింగరేణి ప్రైవేటీకరణను కాంగ్రెస్ పార్టీనే అడ్డుకుందన్నారు.
Telangana Singareni Elections : సింగరేణిలో నూతన అండర్ గ్రౌండ్ బొగ్గు గనులను ఏర్పాటు చేసి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా డిపెండెంట్ కార్మికులకు ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన కార్మికులకు ఒక సంవత్సర కాలంలో ఇంటర్నల్ ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తామని అన్నారు. మహిళా కార్మికులకు ఇబ్బందులు లేకుండా సింగరేణి సంస్థలో పని చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.