Minister Satyavati Rathod Crying in BRS Meeting : వారిని తలచుకుంటూ.. కన్నీరు పెట్టుకున్న మంత్రి సత్యవతి రాథోడ్ - కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
🎬 Watch Now: Feature Video
Published : Oct 7, 2023, 7:39 PM IST
Minister Satyavati Rathod Crying in BRS Meeting : రాష్ట్ర అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు కేటాయించడం ఒకే ఎత్తు అయితే..తాను పుట్టిన ప్రాంతానికి నిధులు కేటాయించడం మరొక ఎత్తునని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంత్రి స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్ద తండాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, బతుకమ్మ చీరలు, క్రికెట్ కిట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సత్యవతి రాథోడ్ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ప్రాంత అభివృద్ధి నా బిడ్డ చేసిన పని అనీ.. సంతోషపడే మొదటి వ్యక్తులు తన తల్లిదండ్రులని ఆమె భావోద్వేగానికి లోనైయ్యారు.
తన తల్లిదండ్రులు ఈ లోకంలో లేకపోవడం చాలా బాధాకరంగా ఉందని అంటూ కంటతడి పెట్టుకున్నారు. సీఎం కేసీఆర్ ఈ ప్రాంత అభివృద్ధికి రూ.450 కోట్లు కేటాయిస్తే.. అందులో రూ.150 కోట్లు పెద్ద తండా ప్రాంతానికి కేటాయించానని చెప్పారు. డోర్నకల్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక్క బోరు కూడా వేయలేదని కొంత మంది అన్నారని.. అప్పటి ప్రభుత్వాలు తమకు సహకరించలేదని గుర్తు చేశారు. కానీ తర్వాత సీఎం అయిన కేసీఆర్ రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇచ్చి.. తన శాఖకు వేల కోట్లు మంజూరు చేశారని హర్షం వ్యక్తం చేశారు.