ఆటో కార్మికులకు తగిన న్యాయం : మంత్రి పొన్నం ప్రభాకర్ - పొపొన్నం ప్రభాకర్ ప్రభుత్వ పథకాల గురించి
🎬 Watch Now: Feature Video
Published : Dec 19, 2023, 9:31 PM IST
Minister Ponnam Prabhakar On Free Bus : తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో, అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ నాయకులు శాసనసభ కార్యదర్శికి లేఖ రాయడాన్ని మంత్రి ఖండించారు. గతంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం మారిందని, దానికి అనుగుణంగా బీఆర్‌ఎస్ నేతలు వ్యవహరించాల్సి ఉందన్నారు.
Ponnam Prabhakar About BRS : గతంలో బంగారు పాలన అందించామని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బంగారు పాలన జరిగితే ప్రజావాణికి వేలాది మంది ప్రజలు సమస్యలు తెలియజేయడానికి ఎలా వస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను వంద రోజుల్లో తాము కచ్చితంగా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది మహిళల కోసమని, ఆటో కార్మికులకు వ్యతిరేకంగా కాదని అన్నారు. ఆటో కార్మికుల కోసం ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు.