'పరిగి నియోజకవర్గానికి త్వరలోనే కృష్ణ నీళ్లు తెప్పిస్తా' - వికారాబాద్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Nov 13, 2023, 5:51 PM IST
Minister KTR Road Show in Vikarabad : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పలు నియోజకవర్గాల రోడ్ షోలు నిర్వహిస్తూ.. విపక్షాలపై విమర్శస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లా పరిగిలోని కులగచర్ల మండల కేంద్రంలో రోడ్ షోలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పాలనా ప్రగతిని వివరించిన కేటీఆర్.. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు.
Minister KTR Assurances in Parigi : పరిగి నియోజకవర్గానికి కృష్ణ నీళ్లు త్వరలోనే తెప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. కులకచర్ల మండలానికి జూనియర్ కాలేజీ మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. పరిగి నియోజకవర్గంలో రూ.2 కోట్లు వెచ్చించి బంజారా భవన్ నిర్మాణం.. ప్రతి గ్రామంలో మహిళా భవనాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. సబ్బండ వర్గాలకు మేలు చేసే విధంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో రూపకల్పన చేశామన్న కేటీఆర్.. భూమిలేని రైతులకు సైతం కేసీఆర్ బీమా అందిస్తామని తెలిపారు. విపక్షాల మాయ మాటల వలలో పడి చేసుకున్న తెలంగాణ అభివృద్ధి నాశనం చేసుకోవద్దని.. సూచించారు.