Minister KTR Participate in BRS Booth Level Meeting : 'ఈ 30 రోజులు సెల్ఫీ కొట్టు.. ఓటు పట్టుతో సోషల్ మీడియాలో దుమ్ము లేవాలి' - ఎల్బీనగర్లో బీఆర్ఎస్ బూత్‌స్థాయి మీటింగ్
🎬 Watch Now: Feature Video
Published : Oct 29, 2023, 7:33 PM IST
Minister KTR Participate in BRS Booth Level Meeting at LB Nagar : ఈ 30 రోజులు పాటు సోషల్ మీడియాలో దుమ్ము లేపాలని.. తెలంగాణ రాక ముందు ప్రస్తుత తెలంగాణ సెల్ఫీలు తీసి ఓట్లను పట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. ఓటరును కలిసేటప్పుడు 2014లో ఎట్లున్న ఎల్బీనగర్ 2023లో ఎట్లా ఉన్నదో ప్రజలకు వివరించాలన్నారు. ఆనాడు కరెంటు కష్టాలు ఎట్లా ఉండేవి.. ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలపాలని పిలుపునిచ్చారు. కర్ణాటక రైతులు, పారిశ్రామిక వేత్తలు రోడెక్కి ధర్నాలు చేస్తున్నారన్నారు. ఆ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయామని గగ్గోలు పెడుతున్నారని వివరించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ బూత్ కమిటీల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్.. పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు.
Telangana Assembly Election 2023 : అన్ని రంగాల్లో ఎల్బీనగర్ దూసుకుపోతుందని.. ఐటీ కంపెనీలు రావాలంటే దమ్మున్న నాయకుల వల్లనే సాధ్యమంటూ తేల్చిచెప్పారు. 14 ఏళ్లు రాష్ట్రం కోసం పోరాటం చేసిన యోధుడు ఒకవైపు.. మిగతా పార్టీలు ఒకవైపు అంటూ.. ఎవరు ఉంటే హైదరాబాద్ సురక్షితంగా ఉంటుదో ప్రజలకు తెలుసునని కేటీఆర్ వివరించారు. మధుయాష్కీకి ఎల్బీనగర్లో ఏ కాలనీ ఏ మూల ఉందో కూడా తెల్వదని ఎద్దేవా చేశారు. రాబోయే 30 రోజులు అంకిత భావంతో పని చేయాలని.. ప్రభుత్వ పథకాలు అన్నింటినీ ప్రతిఒక్కరికీ వివరించాలని కార్యకర్తలకు సూచించారు.