ఉహించని విధంగా సిరిసిల్లను అభివృద్ధి చేశాం : కేటీఆర్ - కేటీఆర్ మీటింగ్
🎬 Watch Now: Feature Video
Published : Nov 9, 2023, 2:34 PM IST
Minister KTR Nomination in Sircilla : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో నామినేషన్ వేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వెళ్లి సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తొమ్మిదిన్నరేళ్లలో సిరిసిల్లలో చేసిన అభివృద్ధిని చూసి తనను ఐదో సారి గెలిపించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
KTR On Sircilla Development : 'అభివృద్ధే నా కులం.. సంక్షేమమే మా మతం అనే కేసీఆర్‌ను గెలిపిద్దామా?..లేదా కులపిచ్చి, మతపిచ్చోలుగా ఉన్న ప్రతిపక్షాలు ఉచ్చులో పడుదామా..? మీరే ఆలోచించుకోండి' అని మంత్రి కేటీఆర్ అన్నారు. కలలో కూడా ఉహించని విధంగా తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. 55 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సిరిసిల్లకు ఏం చేసిందో అడగాలని ఓటర్లను కోరారు. బీజేపీ తొమ్మిదిన్నరేళ్లలో ఏం చేసిందో అడగాలని చెప్పారు. తాగునీరు, సంక్షేమం, అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ చేసిందని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.