'సీఎం కేసీఆర్ ఏ పథకం పెట్టినా మహిళల పేరుతోనే - వారికే పెద్ద పీట' - Uppal Constituency Latest News
🎬 Watch Now: Feature Video
Published : Nov 8, 2023, 5:40 PM IST
Minister Harish Rao Speech at Women Spiritual Meeting : మహిళల సర్వత్రాభివృద్ధికి కృషి చేసింది ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం పెట్టిన మహిళల పేరుతోనే పెట్టారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బుధవారం ఉప్పల్ నియోజక వర్గం బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా.. వీఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించిన మహిళల ఆత్మీయ సమ్మేళన సభలో మంత్రి పాల్గొన్నారు. లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని హరీశ్‌రావు కోరారు. ఈ సందర్భంగా మహిళల కోసం కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రగతిని వివరిస్తూనే.. కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లోస్త్రీలపై జరిగే ఆకృత్యాలు, అల్లర్ల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
హస్తం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అక్క చెల్లెళ్లు కొంత ఆలోచన చేయాలని మంత్రి మనవి చేశారు. కేసీఆర్ వచ్చాక ఏంచేశారు.. గతంలో కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచన చేయాలని కోరారు. ఆనాడు మంచి నీళ్ల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారని.. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఇంటింటికి నీళ్లు ఇస్తున్నారని వివరించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని.. అంతా కారుకు ఓటేయాలి’’ అని హరీశ్‌రావు కోరారు.