కాంగ్రెస్‌ను నమ్మితే మోసపోతాం - పాపమంటే గోసపడతాం : హరీశ్‌రావు - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-11-2023/640-480-20112686-thumbnail-16x9-harish-rao-road-show.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Nov 25, 2023, 5:45 PM IST
Minister Harish Rao Fires on Congress : రైతుబంధు విషయంలో కాంగ్రెస్ కుట్ర చేసిందన్న హరీశ్‌రావు .. కేసీఆర్ చేసిన కృషి వల్ల సోమవారం నుంచి అందరి ఖాతాల్లో రైతుబంధు సొమ్ము జమ అవుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. పాలకుర్తి రోడ్‌షోలో పాల్గొన్న ఆయన.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. డిసెంబర్ 3 తర్వాత మిగిలిపోయిన వారికి వడ్డీతో సహా రుణమాఫీ చేస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. పాలకుర్తి ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరని మంత్రి పేర్కొన్నారు. నోట్ల కట్టలకు పాలకుర్తి ప్రజలు అమ్ముడుపోరని.. కష్టపడిన నేతలను ఇక్కడి ప్రజలు గెలిపించుకుంటారని ఆశావహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ వాళ్ల ఆరు గ్యారంటీలు నమ్మితే.. కర్ణాటక వాళ్లలాగా గోస పడతామని ప్రజలకు హెచ్చారించారు. 5 గ్యారంటీలు నమ్మి కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు.. కరెంట్ బిల్లులు డబుల్ చేసిందని హరీశ్‌రావు విమర్శించారు. కర్ణాటకలో గెలవగానే రాహుల్, ప్రియాంక దిల్లీ వెళ్లి కూర్చున్నారని.. ఆ పార్టీని నమ్మితే మోసపోవడం గ్యారెంటీ అని పేర్కొన్నారు. కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలో.. నిర్ణయించుకోవాల్సింది ప్రజలే అని సూచించారు.