'కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలను - హైదరాబాద్, సికింద్రాబాద్‌ల మాదిరిగా జంట నగరాలుగా తీర్చిదిద్దుతాం' - Harishrao campaign in Kamareddy
🎬 Watch Now: Feature Video
Published : Nov 24, 2023, 8:00 PM IST
Minister Harish Rao Election Campaign : కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలను హైదరాబాద్, సికింద్రాబాద్‌లా జంట నగరాలుగా తీర్చిదిద్దుతామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రోడ్‌షోలలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను నమ్మి అక్కడ ప్రజలు గోసపడుతున్నారని తెలిపారు. ఎల్లారెడ్డి, నారాయణఖేడ్ అభివృద్ధిలో మరింత ముందుకు పోవాలంటే.. సురేందర్, భూపాల్‌రెడ్డిలను గెలపించాలని కోరారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే కారు చీకట్లకు మళ్లీ స్వాగతం పలికినట్లేనని హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ పథకాల ముందు కాంగ్రెస్ పథకాలు నిలబడతాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకోసారి సీఎం మారుతారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎల్లారెడ్డి నియోజకవర్గానికి రూ.10 వేల ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.3 వేలు అమలు చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని తెలిపారు.