Minister Gangula Fires on Opposition Parties : 'రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధిని చూసి ఓర్వలేక.. ప్రతిపక్ష నేతలు విష ప్రచారం చేస్తున్నారు' - కరీంనగర్ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2023, 7:06 PM IST

Minister Gangula Fires on Opposition Parties : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక.. ప్రతిపక్ష నేతలు విష ప్రచారం చేస్తున్నారని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ విమర్శించారు. కరీంనగర్‌లో ఉన్న తీగల వంతెనను.. నగర మేయర్‌ సునీల్‌ రావుతో కలిసి మంత్రి పరిశీలించారు. తెలంగాణకు తలమానికమైన కేబుల్ బ్రిడ్జి నిర్మాణంపై తలెత్తిన చిన్న సమస్యను భూతద్దంలో చూస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ.. ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు.

కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని.. ప్రపంచంలోనే పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించిన టాటా సంస్థ ఈ నిర్మాణం చేపట్టిందని.. పూర్తిస్థాయిలో నాణ్యతతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసిందని అన్నారు. కేబుల్ బ్రిడ్జిపై తారు పోసిన తర్వాత వాహనాలకు అనుమతిస్తున్నామని.. రెండు వైపులా వాహనాలు వెళ్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.