Errabelli on SERP: రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కారణం కేసీఆర్: ఎర్రబెల్లి దయాకర్ రావు
🎬 Watch Now: Feature Video
Minister Errabelli Dayakar Rao about serp employees: సెర్ప్ ఉద్యోగుల పేస్కేలు పెంచిన నేపథ్యంలో కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పాల్గోన్నారు. ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రులని ఇద్దరిని చూశాను వారు ఒకరు ఎన్టీఆర్, ఇంకొకరు కేసిఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గతంలో మహిళల పరిస్థితి చాలా ఘోరంగా ఉండేదని... భర్తలపైనే ఆధార పడేవాళ్లన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసిన ఘనత కేసీఆర్‌దే. రాష్ట్రం ఏర్పడ్డాక మహిళలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇచ్చామన్నారు. ఇప్పుడు భర్తలు ఖర్చుల కోసం భార్యలను అడిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. మహిళల గౌరవం పెరిగిందన్నారు. కరోనా కారణంగా ఆర్థికంగా రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఎదరయ్యాయి. అయినా పింఛన్, కళ్యాణలక్ష్మి, ఇతర అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆగలేదన్నారు. ఇతర రాష్ట్రలో పోలిస్తే తెలంగాణ అన్నింటిలో ముందుందన్నారు. కేవలం ఉద్యోగులకు తప్పా అందరికి పింఛను ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. వడ్డీ లేని రుణాలపై మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి సారించారన్నారు.