Minister Botsa Comments on Telangana: "తెలంగాణ విద్యా వ్యవస్థలో చూచిరాతలు, కుంభకోణాలు" - botsa comments on Telangana education system
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-07-2023/640-480-18986550-524-18986550-1689228986979.jpg)
Minister Botsa Satyanarayana Comments on Telangana: తెలంగాణ విద్యా వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విద్యా విధానాన్ని తెలంగాణతో పోల్చి చూడటం సరికాదన్నారు. తెలంగాణ విద్యా వ్యవస్థలో చూచిరాతలు, కుంభకోణాలు రోజూ చూస్తూనే ఉన్నామన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణని విమర్శించారు. మన విధానం మనది, మన ఆలోచనలు మనవి అని బొత్స వ్యాఖ్యానించారు.
ఏపీ ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థు జాబితా ప్రకటించిన తర్వాత బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను గురువారం విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ, శ్రీకాకుళంలోని ఒక్కో ట్రిపుల్ ఐటీలో వెయ్యి చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయని.. ఈ నెల 20 నుంచి 25 వరకు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. టాప్ 20 వచ్చిన విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే అని మంత్రి బొత్స తెలిపారు.