Edupayala Temple Floods : జలదిగ్బంధంలో ఏడుపాయల ఆలయం.. వరదలోనూ పూజలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 28, 2023, 11:41 AM IST

Updated : Jul 28, 2023, 12:31 PM IST

Huge Flood at Edupayala Temple Medak  : మెదక్​లో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు భారీ వరద పోటెత్తుతోంది. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం వరద నీటిలో చిక్కుకుంది. మంజీరా నది గేట్లు ఎత్తడం వల్ల భారీగా వరద వస్తుండడంతో వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగి పొర్లుతోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండి దిగువకు భారీగా ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పైనుంచి గంగమ్మ పరవళ్లు తొక్కుతూ వనదుర్గామాత ఆలయం ముందున్న నదీపాయ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ మేరకు వనదుర్గామాత ప్రధాన ఆలయాన్ని గంగమ్మ చుట్టుముట్టేసింది. ఆలయ ఈవో సారా శ్రీనివాస్, అర్చకులు వనదుర్గామాత ప్రధాన ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఏడుపాయలకు వచ్చిన భక్తులు రాజగోపురంలోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టగానే మూలవిరాట్ అమ్మవారి దర్శనం యథావిథిగా కొనసాగుతుందని ఈవో సారా శ్రీనివాస్ తెలిపారు.

Last Updated : Jul 28, 2023, 12:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.