'రేపటి నుంచి మెదక్ చర్చిలో శతాబ్ది ఉత్సవాలు - చర్చి ప్రత్యేకత, గొప్పదనం చాటిచెప్పేలా ప్రత్యేక కార్యక్రమాలు' - తెలంగాణలో క్రిస్మస్ వేడుకలు
🎬 Watch Now: Feature Video
Published : Dec 24, 2023, 10:33 PM IST
Medak Church Arrangements for Christmas : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ కేథడ్రల్ చర్చి నిర్మించి 99 ఏళ్లు పూర్తి అయింది. వచ్చే ఏడాది 2024 డిసెంబర్ 25 నాటికి చర్చి నిర్మించి వందేళ్లు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ డిసెంబర్ 25వ తేదీ నుంచి వచ్చే ఏడాది డిసెంబర్ 25 వరకు ఏడాది పొడవునా శతాబ్ధి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చర్చి ప్రెసిబిటరీ ఇన్ఛార్జి శాంతయ్య తెలిపారు. చర్చి ప్రత్యేకత, గొప్పదనం చాటి చెప్పేలా ఏడాది పాటు ప్రతి నెలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది డిసెంబర్ 25న జరిగే శతాబ్ధి వేడుకలకు చర్చి నిర్మాత చార్లెస్ వాకర్ ఫాస్నెట్ కుటుంబ సభ్యులు హాజరవుతారని తెలిపారు.
Christmas Celebrations at Medak Church : క్రిస్మస్ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 535 మంది పోలిసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. ముగ్గురు డీఎస్పీలు, 14 మంది సీఐలు, 56 మంది ఎస్సైలు, ఏఎస్ఐలు, 83 హెడ్ కానిస్టేబుళ్లు, 175 కానిస్టేబుళ్లు, 75 మహిళా కానిస్టేబుళ్లు, 129 మంది హోం గార్డులు ఉన్నారని తెలిపారు.