ఫ్లైవుడ్ గోదాంలో అగ్ని ప్రమాదం - భవనాల నుంచి పరుగులు తీసిన జనం - Fire at Plywood Godown
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-01-2024/640-480-20438917-thumbnail-16x9-fire.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jan 5, 2024, 8:07 PM IST
Massive Fire Accident at Plywood Godown in Hyderabad : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గాజులరామారంలోని ఓ ఫ్లైవుడ్ షాపుకు సంబంధించిన గోదాంలో మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న ఫ్లైవుడ్స్ మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదం దాటికి సమీపంలోని భవనాల్లోకి పొగలు వ్యాపించాయి. దీంతో ఆ భవనాల నుంచి నివాసితులు బయటకు పరుగులు తీశారు. వెంటనే అక్కడున్న స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
Fire Accident in Plywood Godown : వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఫ్లైవుడ్ గోదాంలో ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. జగద్గిరి గుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మూడు రోజుల క్రితం ఉప్పల్ పరిధిలోని సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి, పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ఈ ఘటనలో షార్ట్ సర్క్యూట్‌తోనే మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేశారు.