Marwadi People Dance in Ganesh Nimajjanam 2023 : గణేశుని నిమజ్జన వేడుకల్లో స్టెప్పులతో అలరించిన మార్వాడీలు - Marwadi People Dance in Ganesh Nimajjanam 2023

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2023, 4:56 PM IST

Marwadi People Dance in Ganesh Nimajjanam 2023 : భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం శోభాయమానంగా జరుగుతోంది. నగర నలుమూలల నుంచి తరలివస్తోన్న వినాయక విగ్రహాలు గంగమ్మ ఒడిలోకి చేరుతున్నాయి. గణేశ్ నిమజ్జన వేడుకల్లో చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు యువతలో ఉత్సాహం ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విశ్వవ్యాప్తంగా ఉండే పండుగలన్నీ ఒక ఎత్తైతే.. లంబోదరుడి నిమజ్జనోత్సవం మరో ఎత్తు అనడంలో అతిశయోక్తి ఏమీలేదు.

యువత డీజే చప్పుళ్లలో.. మేళ తాళాలు, డ్రమ్స్, వాయిద్యాల నడుమ భక్తులు చేసే కోలాహలం అంతా ఇంతా కాదు. బేగంబజార్​కు చెందిన మార్వాడీలు బషీర్​బాగ్ కూడలిలో వినాయక విగ్రహం ముందు గర్బా, దాండియా మొదలగు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. రోడ్లపై పాదచారులు, వాహనదారులు ఆగిమరీ ప్రత్యేకంగా డ్యాన్సులను వీక్షించారు. ఇలా ఊరేగింపుగా సాగుతున్న గణనాథుని వేడుకల్లో ఎటువంటి అపశ్రుతి జరగకుండా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే నగరమంతా ఎక్కడికక్కడే గస్తీ పెంచి, పటిష్ఠ చర్యలు చేపట్టారు.    

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.