Mangalore Car Accident Viral Video : ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు.. యువతి స్పాట్ డెడ్.. లైవ్ వీడియో - పాదచారులను ఢీకొట్టిన కారు
🎬 Watch Now: Feature Video
Published : Oct 19, 2023, 10:48 AM IST
Mangalore Car Accident Viral Video : ఫుట్‌పాత్‌పై నడుస్తున్న వారిపైకి కారు వేగంగా దూసుకెళ్లగా.. ఓ యువతి అక్కడిక్కడే మృతి చెందింది. మరో నలుగురు యువతులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కర్ణాటకలోని మంగళూరులో బుధవారం సాయంత్రం జరిగింది. దీనికి సంబంధించిన ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి.
ఇదీ జరిగింది
మంగళూరు కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఐదుగురు యువతులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలోనే కమలేశ్ బలదేవ్ అనే వ్యక్తి కారులో మన్నగూడ జంక్షన్ నుంచి లేడీహిల్ వైపు వెళ్తున్నాడు. వేగంగా వచ్చిన కారు.. అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లి పాదచారులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువతి అక్కడిక్కడే మృతి చెందగా.. మరో నలుగురు యువతులు గాయపడ్డారు. దీంతో భయపడిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం సమీపంలోని కారు షోరూం వద్ద కారును ఆపి ఇంటికి పారిపోయాడు. తర్వాత తండ్రితో కలిసి వచ్చి మంగళూరు వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.