ఆన్లైన్ గేమ్ ఆడి లక్షల్లో అప్పులు - కారణం తండ్రే అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్ - అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
🎬 Watch Now: Feature Video
Published : Dec 18, 2023, 10:02 PM IST
Man Suicide With Selfie Video : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ యువకుడు ఆన్లైన్ గేమ్‌లకు అలవాటు పడి నష్టపోయానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో కలకలం రేపింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం. భువనగిరి మండలం బండ సోమరం గ్రామానికి చెందిన చిరుకూరి ప్రసాద్ (35) ఆత్మహత్య చేసుకుంటున్నాను అని సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను ఆన్ లైన్గేమ్స్కు అలవాటు పడడంతో రూ.లక్షల్లో అప్పులు అయ్యాయని వెల్లడించాడు.
Man Suicide due to Debts : తన చావుకు తన తండ్రి భౌరయ్య కారణం అంటూ సెల్ఫీ వీడియోలో ప్రసాద్ పేర్కొన్నాడు. తన తండ్రి మందలించడంతో ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియోలో తెలిపాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్న ప్రదేశం ఎవరికీ తెలియదని అన్నాడు. తన కోసం ఎవరూ వెతకొద్దని ప్రసాద్ వీడియోలో పేర్కొన్నాడు. ప్రసాద్ సెల్ స్విచ్ ఆఫ్‌గా ఉండడంతో బంధువులు, గ్రామస్థులు అతని ఆచూకీ కోసం వెతుకుతున్నారు. కాగా ప్రసాద్‌కి భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.