Man Feeding Crocodile Viral Video : మొసలికి ఆహారం తినిపించిన వ్యక్తి!.. నది ఒడ్డున కూర్చుని.. - మొసలికి ఆహారం పెడుతున్న వైరల్ వీడియా
🎬 Watch Now: Feature Video


Published : Sep 1, 2023, 9:52 AM IST
Man Feeding Crocodile Viral Video : ఓ వ్యక్తి మొసలికి ఆహారం తినిపించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. గుజరాత్‌లోని గీర్ సోమనాథ్ జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. హిరాన్ నది ఒడ్డున ఉన్న ఖోడియార్ ఆలయ సమీపంలో జీవా భగత్ అనే వ్యక్తి నీళ్లలో ఉన్న మొసలికి ఆహారం తినిపించాడు. అనంతరం మొసలి తలపై పలుమార్లు నిమురుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ దృశ్యాలను అక్కడున్న వారు చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోను 'ఈటీవీ భారత్' ధ్రువీకరించలేదు.
తాచు పాముకు ముద్దు..
పాము కనిపిస్తేనే అమ్మో అని భయపడి ఆమడ దూరం పరుగెడతారు చాలా మంది. కానీ కర్ణాటకలోని చిక్కమంగళూరుకు చెందిన అర్జున్ ఇందుకు భిన్నం. పాములతో ఆడుకోవడం అలవాటు చేసుకున్న అర్జున్.. ఏకంగా వాటిని ముద్దాడుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు. 11 అడుగుల ఓ తాచుపామును కళ్లలోకి కళ్లుపెట్టి చూస్తూ.. అలవోకగా ముద్దాడాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఆసక్తికరమైన వీడియో చూడాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.