డ్యాన్ చేస్తుండగా గుండెపోటు సెకన్లలోనే మృత్యు ఒడిలోకి - పెళ్లిలో గుండెపోటుతో మృతి
🎬 Watch Now: Feature Video
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ పెళ్లి వేడుకల్లో విషాదం నెలకొంది. పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటు రావడం వల్ల ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తన మేనల్లుడి పెళ్లిలో పాల్గొనడానికి మనోజ్ అనే వ్యక్తి వారణాసి నుంచి మండీవాడీహ్ అనే ప్రాంతానికి వచ్చాడు. వరుడి బంధువులు ఊరేగింపులో భాగంగా డప్పు వాయిద్యాలతో డ్యాన్స్‌లు వేస్తూ లఖ్‌నవూకు బయలుదేరారు. అయితే డ్యాన్స్ చేస్తున్న సమయంలో మనోజ్‌కు గుండెపోటు రాగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే బంధువులు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. కేవలం 5 సెకండ్లలోనే ఈ విషాదం జరిగిందని మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST