Live Accident Video: స్కూటీ కంట్రోల్ తప్పి ద్విచక్రవాహనదారుడి దుర్మరణం - latest news in nalgonda
🎬 Watch Now: Feature Video
Road accident at Narketpalli: అతివేగం ప్రమాదకరమని రోడ్డుకు ఇరువైపులా బోర్డులు కనిపిస్తూనే ఉంటాయి. ఇంట్లో పెద్దలు, తల్లిదండ్రులు, బయట పోలీసులు ఈ విషయాన్ని ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. అయిన కొంత మంది వ్యక్తులు ఆ మాటలను పెడ చెవిన పెడుతుంటారు. మనకేం జరుగుతుందిలే అనే ధీమాతో భద్రతా నియమాలు కూడా పాటించరు. కనీసం హెల్మెట్ కూడా ధరించరు. మరికొంత మంది అవగాహన లోపంతో నియమాలను పాటించరు. ఇలా పాటించకపోవడం వలన ప్రమాదాలు నిత్యం జరుగుతునే ఉన్నాయి.
ఇలా తొందరపాటుతో జరిగే జరిగే రోడ్డు ప్రమాదాలతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు గాయపడ్డ జీవితాంతం అంగవైకల్యంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇలా భద్రతా నియమాలు పాటించని వ్యక్తులు చేసిన తప్పుకి మిగిలిన వ్యక్తులు కూడా ఇబ్బందులు పడుతుంటారు. ఇలా అజాగ్రత్త వల్లే నార్కెట్పల్లి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. నార్కెట్పల్లి నుంచి అద్దంకి వెళ్తున్న హర్యానా కంటైనర్ లారీని అతివేగంతో వచ్చిన స్కూటీ ఢీ కొట్టింది. దీంతో స్కూటీ నడుపుతున్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. మృతుడిని పరిశీలించగా నల్గొండకు చెందిన దున్న అశోక్(25)గా గుర్తించారు.
పంచనామా అనంతరం మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీసీ పుటేజ్ ఆధారంగా కంటైనర్ వావానాన్ని వాడపల్లి చెక్పోస్ట్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.