Revanth Reddy Missing Posters in Hyderabad : రేవంత్‌రెడ్డి కనిపించడం లేదు.. మల్కాజిగిరి పరిధిలో పోస్టర్ల కలకలం - Malkajgiri MP Revanth Reddy is missing posters

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 28, 2023, 9:16 PM IST

MP Revanth Reddy Missing Posters : సికింద్రాబాద్‌లో వరదల వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ ఎంపీ రేవంత్‌రెడ్డి కనబడటం లేదంటూ మల్కాజిగిరి పరిధిలో పోస్టర్లు కలకలం రేపాయి. కంటోన్మెంట్, బోయిన్‌పల్లి, కార్ఖానా ప్రాంతాల్లోని బస్‌స్టాప్‌లలో, ప్రధాన కూడళ్ల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లను అంటించారు. తమ ఇబ్బందులను రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదంటూ పోస్టర్లతో ఆరోపించారు. ఈ పోస్టర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

హైదరాబాద్‌లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా.. పలు కాలనీలు ఇప్పటికీ వరద ప్రవాహంలో చిక్కుకుని ఉన్నాయి. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా.. వరద ఇంకా కొనసాగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించి.. వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వరద ముంపును తగ్గించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.