Mahbubnagar Woman SI Successful Story : తండ్రి ట్రాక్టర్​ డ్రైవర్​, తల్లి రోజువారీ కూలీ.. కూతురేమో కాబోయే ఎస్సై - తారక సక్సెస్​ స్టోరీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 16, 2023, 10:15 PM IST

Mahbubnagar Woman SI Taraka Success Story : ఇటీవల విడుదలైన ఎస్సై ఫలితాల్లో మొదటి ప్రయత్నంలో సత్తా చాటింది మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పేదింటి కుసుమం తారక. పేరుకు తగ్గట్టుగానే విద్యావంతురాలిగా కుసుమించి.. చివరకు తన, కుటుంబ సభ్యుల కలలను నిజం చేస్తూ పోలీసు ఉద్యోగం సంపాదించింది. జోగులాంబ గద్వాల జోన్ పరిధిలో సివిల్ కేటగిరి ఎస్.ఐగా ఎంపికైంది. మొదటి ప్రయత్నంలోనే ఇలా సివిల్​ ఎస్సై కొట్టడం అంటే అంత సులువైన పని కాదు.. పట్టుదల ఉంటే సాధించలేనిది అంటూ ఏదీ లేదని తారక నిరూపించింది. తండ్రి ట్రాక్టర్ డ్రైవర్​గా, తల్లి రోజువారీ కూలీగా పనిచేస్తూ కష్టపడి కన్నకూతురిని చదివించారు. తన తల్లిదండ్రుల కష్టాలను చూసి చివరకు మొదటి ప్రయత్నంలోనే ఎస్సై కొలువుకు ఎంపికైన తారక విజయం వెనక.. ఆమె పడ్డ కష్టం ఏంటి? పరీక్ష కోసం ఎలా సన్నద్ధమయ్యారు? భవిష్యత్తు లక్ష్యాలు.. యువతకు ఇచ్చే సందేశం ఏంటో తెలుపుతున్న తారకతో ఈటీవీ బారత్​ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.