Mahabubabad Floods : వర్షాలు తగ్గినా వదలని ముప్పు.. రైతుల ఆందోళన - Mahabubabad Floods Farmers Problems
🎬 Watch Now: Feature Video
Mahabubabad Floods Farmers Problems : మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రవాహం కొనసాగుతోంది. మున్నేరు, ఆకేరు, పాలేరు, వట్టి, పాకాల.. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వాగుల వెంట ఇరువైపులా వేలాది ఎకరాల్లో బురద పేరుకపోయి.. ఇసుక మేటలు వేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేల రూపాయలు పెట్టుబడులు పెట్టామని పంట పొలాల్లో ఇసుక , బురద మేటలు వేయడంతో పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితి కనిపించడం లేదని వాపోయారు. పట్టణం శివారులో ఉన్న మున్నేరు వాగు ప్రవాహానికి జాతీయ రహదారి కోతకు గురైంది. వాగులు, ప్రవాహాల వద్ద రహదారులు దెబ్బతిన్నాయి. జిల్లాలో దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులు, కూలిపోయిన గృహాలను జిల్లా కలెక్టర్ శశాంక.. అధికారులతో కలిసి పరిశీలించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ , డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో ముంపు ప్రాంతాలను, దెబ్బతిన్న రహదారులు, కల్వర్టు లను పరిశీలించి.. బాధితులుకు ధైర్యం కల్పించారు. గార్ల మండలం రాంపురం గ్రామంలో సురేష్ అనే వ్యక్తికి గుండె నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లే దారిలేక రైల్వే ట్రాక్‌పై రెండు కిలోమీటర్లు మోసుకొచ్చి మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.