MP Kavitha on assembly elections : 'పార్టీ చెప్పిన చోటే పోటీ చేస్తా.. ఎమ్మెల్యేగా పోటీపై కేసీఆర్‌దే తుదినిర్ణయం' - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
MP Kavitha reacts to the contest in the assembly elections : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఇల్లందు లేదా మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్టు జరుగుతున్న ప్రచారంపై మహబూబాబాద్ ఎంపీ కవిత స్పందించారు. పార్టీ నిర్ణయానుసారం... ఎక్కడ అవకాశమిచ్చినా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇల్లందులోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన ఆమె... అలుగు పోస్తున్న ఇల్లందులపాడు చెరువుకు పూజలు చేశారు. పట్టణంలోని పలు వార్డులలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీ, బంజారాల మధ్య విభేదాలు సృష్టించేందుకు బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీ, బంజారాలు విభేదాలు లేకుండా అన్నదమ్ముల్లా కలసి మెలసి ఉండాలని అన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో అర్హులకు దళిత బంధు రావడం లేదని స్థానిక మహిళలు చేసిన ఫిర్యాదుపై స్పందిస్తూ ఇల్లందు నియోజకవర్గంలో అర్హులైన 500 మంది పేదలకు దళిత బంధు వస్తుందని ఈ విషయంలో ఎమ్మెల్యే హరిప్రియతో మాట్లాడతానని తెలిపారు.