Machilipatnam JC Registered Marriage with IPS: ఎలాంటి హంగూ.. ఆర్భాటం లేకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఆదర్శ వివాహం - IAS Marriage with Trainee IPS
🎬 Watch Now: Feature Video
Machilipatnam JC Registered Marriage with IPS: 'పెళ్లి లేదా వివాహం' అనేది ప్రతి యువతి, యువకుడి జీవితంలో ప్రధానమైన ఓ ఘట్టం. పెళ్లి చూపులు మొదలుకొని అప్పగింతల వరకూ బంధువులు, పెద్దలు, మిత్రుల సమక్షంలో జరిగే ఓ అద్భుతమైన కార్యక్రమం. అలాంటి కార్యక్రమాన్ని ఇద్దరు (ఒకరు ఐపీఎస్, మరొకరు ఐఏఎస్) ఆఫీసర్లు ఎలాంటి హంగూ ఆర్భాటాలు, బంధుమిత్రులు లేకుండానే సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఆదర్శంగా నిలిచారు. మరి ఎవరా ఆఫీసర్లు..? ఏ రాష్ట్రానికి చెందిన వారు..? అనే వివరాలు మీకోసం..
IAS Marriage with Trainee IPS: ఆదర్శ వివాహం చేసుకున్న ఆఫీసర్లు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మచిలీపట్నం జాయింట్ కలెక్టర్ (జేసీ)గా విధులు నిర్వర్తిస్తున్న డా. అపరాజిత సింగ్ సిన్వర్.. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఆదర్శంగా నిలిచారు. రాజస్థాన్‌కు చెందిన అపరాజిత సింగ్.. అదే రాష్ట్రానికి చెందిన ట్రైనీ ఐపీఎస్ దేవేంద్రకుమార్‌ను వివాహమాడారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో బుధవారం రోజున జిల్లా రిజిస్ట్రార్ సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. అయితే, వీరి పెళ్లి ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. డా. అపరాజిత సింగ్ సిన్వర్, దేవేంద్రకుమార్ పరస్పరం దండలు మార్చుకుని అందరి చేత ఔరా అనిపించారు. యూపీ కేడర్‌కు చెందిన దేవేంద్రకుమార్.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. వివాహం అనంతరం ఈ నూతన దంపతులు గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని శ్రీకొండాలమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు.