Lulu Mall Opening in Hyderabad : హైదరాబాద్‌కు 'లులు మాల్' వచ్చేసింది.. ఎంత పెద్దగా ఉందో చూశారా..? - హైదరాబాద్‌లో లులు మాల్ ప్రారంభం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-09-2023/640-480-19619630-thumbnail-16x9-lulu-mall-opng.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Sep 27, 2023, 4:05 PM IST
Lulu Mall Opening in Hyderabad : హైదరాబాద్‌లో లులు గ్రూప్ ఏర్పాటు చేసిన హైపర్ మాల్ అందుబాటులోకి వచ్చింది. కూకట్‌పల్లి జేఎన్టీయూ సమీపంలో ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు లులు మాల్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా రూ.300 కోట్లలతో లులు హైపర్ మాల్‌ను అందుబాటులోకి తెచ్చింది. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మాల్‌ను తీర్చిదిద్దారు. ఇక్కడ 75 కంటే ఎక్కువ స్థానిక, అంతర్జాతీయ బ్రాండ్‌లు అందుబాటులో ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
KTR Inaugurates Lulu Mall in Hyderabad : 1400 మంది సీటింగ్ సామర్థ్యంలో 5 సినిమా స్క్రీన్స్‌తోపాటు పుడ్ కోర్టులు, పిల్లల వినోదానికి కావల్సిన అన్నిరకాల గేమ్స్ ను ఏర్పాటు చేసిన ఈ మాల్ ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. యూఏవోలో లులు గ్రూపు 270 హైపర్ మార్ట్‌లు ఏర్పాటు చేసిందన్న మంత్రి... తెలంగాణలో రూ.3వేల 500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. త్వరలోనే సూపర్ మార్కెట్లు, మాల్స్, పుడ్, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లలో కూడా లులు గ్రూపు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు వివరించారు. ఆహార రంగం, ఆహార శుద్ధి రంగాల్లో పెడుతున్న పెట్టుబడులతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.