Lorry Overturned at Narsapur Road : బియ్యం లోడ్​తో వెళ్తున్న లారీ బోల్తా.. కిలోమీటర్​ మేర ట్రాఫిక్​ జామ్​..

By Telangana

Published : Sep 2, 2023, 1:09 PM IST

thumbnail

Lorry Overturned at Narsapur Road : మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్​ మండలంలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో కట్టమైసమ్మ గుడి ముందున్న నర్సాపూర్ ప్రధాన రహదారిపై ఇవాళ ఉదయం లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్​కు స్వల్పంగా గాయాలయ్యాయి. లారీ బోల్తా పడటంతో వాహనంలో ఉన్న బియ్యం బస్తాలు కింద పడిపోయాయి.

Narsapur Road Lorry  Accident Today : బియ్యం లోడుతో నర్సాపూర్​  వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి కింద పడిపోయింది. ఈ క్రమంలో  కిలో మీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికులు అందించిన సమాచారంతో  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం డ్రైవర్​ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్​ నిద్ర మత్తులో  లారీ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో రోడ్డుపై ఎక్కువ మంది ప్రయాణికులు లేకపోవడం వల్ల ఎటువంటి ప్రాణహానీ జరగలేదని తెలిపారు. రోడ్డు పై కిలోమీటర్​ మేర నిలిచిన ట్రాఫిక్​ను పోలీసులు క్లియర్ చేశారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.