నేటి అవసరాలకు తగిన యాప్ రూపకల్పన - లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్న యువకుడు - Bharat Interview

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 4, 2024, 4:41 PM IST

Local Dukan App Developer Bharat Interview : బీటెక్‌ పూర్తిచేయాలి. మంచి ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్‌ కొలువు సంపాదించాలి. ఇదీ నేటి యువతరంలో చాలామంది కోరుకునేది. కానీ ఆ యువకుడు మాత్రం చదువైన వెంటనే బిజినెస్‌ చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. తనతో పాటు సాటివారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అనుకున్నాడు. మొబైల్‌ యాప్‌లపై ఒక అవగాహన వచ్చాక, స్నేహితులతో కలసి ఒక విభిన్నమైన యాప్​ను రూపొందించాలి అనుకున్నాడు. దీంతో హైదరాబాద్​కు వచ్చి కొన్ని నెలలు శిక్షణ పొందాడు. కానీ అది ఫలితాన్ని ఇవ్వలేకపోవడంతో తన స్నేహితులతో కలిసి ఒక యాప్ డెవలప్​ చేశాడు. ప్రారంభదశలో ఇబ్బందులు అధైర్యపడకుండ తన తండ్రి మద్ధతుతో 'లోకల్‌ దుకాణ్‌'అనే యాప్​ను డెవలప్ చేసి దాన్ని విజయవంతంగా నడిపిస్తున్నాడు. వివిధ రకాల సేవలందించే ఆ యాప్‌ ఏంటో? సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను మించి నెలకు రూ.3 నుంచి 4 లక్షల ఆదాయం ఎలా అందుకోగలుగుతున్నాడో, సంగారెడ్డికి చెందిన భరత్‌ మాటల్లోనే విందాం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.