శవపేటికలో మద్యం బాటిళ్లు.. అంబులెన్స్‌లో అక్రమ రవాణా - వైరల్ వీడయోలు
🎬 Watch Now: Feature Video
స్మగ్లర్ల ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. రోజుకో కొత్త మార్గాల్లో మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు స్మగ్లర్లు. ఇప్పుడు ఏకంగా అక్రమ రవాణా కోసం శవపేటికను వాడుకున్నారు. దాన్ని తరలిచేందుకు ఆపదలో ఆదుకునే అంబులెన్స్‌ను ఉపయోగించారు. ఇలా అంబులెన్స్‌లో మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తులను బిహార్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. శవపేటికలో మద్యం బాటిళ్లను ఉంచి అక్రమంగా రవాణా చేస్తున్న గ్యాంగ్‌ను.. పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు. శవపేటికలో ఉన్న 212 విదేశీ మద్యం బాటిళ్లను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. గయాలోని దోభి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ మద్యం బాటిళ్లు చాలా ఖరీదైనవని పోలీసులు తెలిపారు. నిందితులు ఝార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి ముజఫర్‌పుర్‌కు మద్యాన్ని తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులను పంకజ్ కుమార్ యాదవ్, లలిత్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఇద్దరు ఝార్ఖండ్ చెందినవారని వారు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసుకున్నామని తెలిపిన పోలీసులు.. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని తెలిపారు. నిందితులు తెలివిగా శవపేటికలో మద్యాన్ని తరలించడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దానికి అంబులెన్స్‌ను వాడుకోవడంపై ఆగ్రహాం వ్యక్తం చేశారు.