కంచె దూకి మరీ వ్యాన్‌పై దాడి చేసిన చిరుత - leopard viral video
🎬 Watch Now: Feature Video
అసోంలోని జోర్హాట్‌లో ఓ చిరుత హల్‌చల్ సృష్టించింది. స్థానికంగా వరుస దాడులకు పాల్పడుతూ దాదాపు 15 మందిని గాయపర్చింది. ఇందులో ఇద్దరు అటవీశాఖ సిబ్బందీ ఉన్నారు. గత 24 గంటల వ్యవధిలో ఇక్కడి రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివాసితులతోపాటు పరిసర ప్రాంతాల్లోని మహిళలు, చిన్నారులపై చిరుత తన పంజా విసిరింది. చిరుత దాడి చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆర్‌ఎఫ్‌ఆర్‌ఐ క్యాంపస్ కంచె దూకి ఓ వ్యాన్‌పై దాడి చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో ప్రజలను ఇళ్లలోనే ఉండాలని సూచించినట్లు చెప్పారు. చిరుతను పట్టుకునే క్రమంలో ఎక్కడికక్కడ ఉచ్చులు బిగించిన అటవీశాఖ అధికారులు మత్తుమందు ఇచ్చి దాన్ని బంధించినట్లు తెలుస్తోంది.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST